Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో వక్తలు
- పెద్దమ్మ తల్లి దేవాలయం సన్నిధిలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు సంతోషాన్నిచ్చింది
- నవ్వులతో సందడి.. ఉత్సాహంగా పలకరింపులు
నవతెలంగాణ-కొత్తగూడెం
బొగ్గు పరిశ్రంమలో ఎంతో చరిత్ర కలిగిన సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ అని అంతే కాకుండా సింగరేణి కంపెనీకి గుండెకాయ లాంటిదని సింగరేణి సెంటర్ వర్క్ షాప్ మాజీ కార్మికుల నాయకులు అన్నారు. ఆదివారం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రైటర్ బస్తి ఏరియాలో ఉన్న సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ పెద్దమ్మ తల్లి దేవాలయం ఆవరణలో సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ మాజీ కార్మికుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సందడిగా జరిగింది. 1973 సంవత్సరం నుండి 30 ఎండ్లుగా కలిసి పనిచేసిన కార్మికులు ఇటీవల రిటైర్డు అయ్యారు. వారంత ఆదివారం ఆత్మీయ సమ్మెళనం నిర్వహించి, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాజీ కార్మికులు మాట్లాడుతూ సెంట్రల్ వర్క్ షాప్ ఏరియా నుండి అనేక కార్మికుల హక్కులను సాధించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏ పనిముట్లు కావాలన్నా ఇక్కడినుండే తయారుచేసి సింగరేణి వ్యాప్తంగా సరపర చేయడం గర్వకారణమని గుర్తుచేసుకున్నారు. వర్క్ షాప్ అభివృద్ధికి నిరంతరం పాటుపడడం జరిగిందన్నారు. కార్మిక పోరాటాల ద్వారా బ్యాంకు జీతాలు, కార్మికులకు ఉచిత గ్యాస్ సదుపాయం ఈ వర్క్ షాప్ నుండే సాధించుకోవడం పోరాట ఫలితమన్నారు. తాము రిటైర్మెంట్ అయినా కూడా తరచూ సింగరేణి సెంటర్ వర్క్ షాప్ను గుర్తు చేసుకుంటామన్నారు. తమహా యంలోనే సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ ఆవరణలో పెద్దమ్మతల్లి దేవాలయాన్ని నిర్మించుకున్నట్లు తెలిపారు. దేవాలయం అభివృద్ధికి తమ జీతాల నుండి సహాయ సహకారాలు అందించామని పేర్కొ న్నారు. పెద్దమ్మ తల్లి దేవాలయం సన్నిధిలో సింగ రణి సెంట్రల్ వర్క్ షాప్ మాజీ కార్మికులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేసుకోవడం ఎంతో సంతో షకరంగా ఉందన్నారు. ఇకనుంచి ప్రతి ఏడాది నవం బర్ నెలలో ఇదే పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కొనసాగించు కుందా మని స్పష్టం చేశారు. మాజీ కార్మికులను దృష్టిలో పెట్టుకొని సింగరేణి యాజమాన్యం కూడా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు సాలార్ సత్యనారా యణ, ఉమాకర్, ఇస్మాయిల్, మల్లెల రామనాధం, రాజారావు, సమ్మయ్య, రాములు, రామారావు, కామేశ్వరరావు, నరసింహారావు పాల్గొన్నారు.