Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీటీపీఎస్ సీఈకి వినతి
నవతెలంగాణ-మణుగూరు
లారీల వేగాన్ని నియంత్రించాలని బీటీపీఎస్ సీఈ బిచ్చన్నకి ఆదివారం నేను సైతం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు తారాప్రసాద్ వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. గత కొంత కాలంగా మణుగూరు సింగరేణి సంస్థ నుండి బీటీపీఎస్‌కు లారీల ద్వారా బొగ్గు రవాణా చేస్తున్నారన్నారు. బొగ్గు రవాణా చేసే క్రమంలో లారీ డ్రైవర్లు రోజుకు సాధ్యం అయినంత ఎక్కువ ట్రిప్పులు వేయాలనే తొందరలో, వేగంగా లారీలు నడుపుతున్నారన్నారు. కావునా బీటీపీఎస్‌కు తిరిగే లారీలకు స్పీడ్ మీటర్లు పెట్టీ, 25 కి.మీ వేగాన్ని పరిమితం చేయాలన్నారు. స్పందించిన సీఈ మాట్లాడుతూ లారీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లను చేయించాలన్నారు. నేటి నుంచి ప్రతీ రోజు బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లను క్రమం తప్పకుండా నిర్వహించాలని సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు.