Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లు గడచినా డబుల్ ఇండ్లకు గతిలేదు
- నత్త నడకన డబుల్ ఇండ్ల నిర్మాణాలు
- సీపీఐ(ఎం) పోరాట ఫలాలు పేదలకు అందకుండా చేసిన ప్రభుత్వం
- ఖాళీగా ఉన్న స్థలాన్నిపేదలకుపంచాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన, నాణ్యతా ప్రమాణాలు లేకుండానే నిర్మాణాలు సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తోన్నాయి. 2018 సంవత్సరంలో పూర్తిచేసి ఆ సంవత్సరం ఉగాది నాటికి అర్హులందరికీ రెండు పడకల ఇళ్లు కట్టి ఇస్తామని ఇచ్చిన హామీలు గంగలోకలసిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులు ఇస్తున్న హామీలతో ప్రజలను ఊరిస్తున్నాయే తప్పా...పేదవారి డబుల్ బెడ్ రూమ్ కళ నెల వేరడంలేదని తెలుస్తుంది.
కొత్తగూడెం మున్సిపల్ పరిధి, పాతకొత్తగూడెంలో నిర్మాణాలు ప్రారంభించిన పనులు 4 ఏండ్లు గడుస్తున్నప్పటికీ ముందుకు సాగడంలేదు. నిర్మాణాల పనులల్లో నాణ్యాతా ప్రమానాలు లేక నాసిరకంగా పనులు సాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. పురపాలక పరిధిలోని పాత కొత్తగూడెంలోని 40 ఎకరాల ప్రభుత్వ భూమిలో రెండు పడకల ఇంటి నిర్మాణాలు సాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా సీపీఐ(ఎం) చేసిన పోరాటాల ఫలితంగా 2011 సెప్టెంబర్‌లో 11 సంవత్సరాల క్రితమే అప్పటి ప్రభుత్వం 39 ఎకరాల 27కుంటల భూమిని ఎకరం రూ.1లక్షా10వేల చొప్పున కొనుగోలు చేసింది. పేదలకు ఇండ్ల స్థలాలుగా ఇవ్వాలని నిర్ణయించింది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ఇండ్ల స్థలాలు ఇచ్చేది లేదని, రెండు పడకల ఇండ్లు ఇస్తామని మాయ మాటలు చెప్పింది. దీంతో పేదలకు ఇండ్ల స్థలాలు రాకుండా పోయాయి. తరువాత 40 ఎకరాల ఆ స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలకు పూనుకుంది.. 5 ఏండ్లు కావోస్తున్నప్పటికీ పనుల్లో పురోగతి కనిపించడంలేదు. కొత్తగూడెం నియోజక వర్గంలో ప్రభుత్వం మంజూరు చేసిన 1800 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 2017 దసరా పండుగ నాటికి లబ్దిదారులతో గృహప్రవేశాలు చేసేలా నిర్మాణాలు చేస్తున్నట్లు ఆనాటి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు హామీ ఇచ్చి, 2017 మే నెల 16వ తేదీన లాంఛనంగా భూమి పూజచేశారు. 5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి నిర్మాణాలు ముందుకు సాగడం లేదు.
కొత్తగూడెంలో సీపీఐ(ఎం) పోరాట ఫలితంగా సాధించిన సుమారు 40 ఎకరాల భూమిలో రూ.40 కోట్ల వ్యయంతో 828 ఇండ్లు నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. 2019 జనవరి నాటికి ఇంటి నిర్మాణాలు పూర్తిచేసి పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం కాంట్రాక్టర్ల పై ఒత్తిడి చేస్తున్నారు. బిల్లురాక కంట్రాక్టర్లు పనులను పక్కకు పడేసినట్లు తెలుస్తుంది. ఐదేండ్ల క్రిత ప్రారంభించిన పనులు ముందుకు సాగకపోగా, డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు కొన్ని ప్లెంత్ బీమ్ లెవల్ తొలి దశలోనే మూలుగుతున్నాయి. కొన్ని బ్లాకులు పునాధి స్థాయికి మించి పైకి ఎత్తు కాలేదు. ఇండ్డు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని పేద ప్రజల్లో గుబులు మొదలైంది. నాలుగేండ్లుగా నిర్మిస్తున్న భవనాలు సరైన యాజమాన్యంలేక నిర్మాణంలో సిమెంట్ కొన్ని చోట్ల రాలిపోయింది. కొన్ని చోట్లు పగుళ్లురావడం కనిపిస్తుంది. కొన్నిచోట్లు ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. వేసవి కాలంలో వేసిన కొన్ని బ్లాక్‌ల ఫిల్లర్స్కు క్యూరింగ్ సక్రమంగా చేయక పోవడంతో పగుళ్లు కనిపిస్తోన్నాయి. కొత్తగూడెం నియోజక వర్గంలో సుమారు 27వేల మంది పేదలు రెండు పడకల ఇండ్ల కోసం దరఖా స్తులు చేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం పేదల నుండి దరఖాస్తులు తీసుకున్నారు. ఒక్కరికి ఒక్క ఇళ్లురాలేదు.. వస్తుందనే నమ్మకం కూడ లేదు. ఇప్పటికీ చాతకొండ, త్రి ఇంక్లైయిన్, చుంచుపల్లి, పాల్వంచలోని నిర్మంచిన ఇండ్లు పేదలకు అందజేయలేదు. పాత కొత్తగూడెంలో నిర్మాణాలు జరుగుతున్నా 828 ఇండ్లు, అధికారులు ఎంత మంది పేద లబ్ధిదారులకు పంచుతారో వేచిచూడాలి. కాగా పదికాలల పాటు పేదలు నివాసం ఉండాల్సిన ఇండ్లను నాణ్యతతో నిర్మించక పోవడం విచారకరం అంటున్నారు.
రెండు పడలకల ఇండ్ల నిర్మాణాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం
ప్రభుత్వం చాతకాని తనం కారణంగానే ఢబుల్ బెడ్రూం ఇడ్ల నిర్మాణాలు పూర్తికాలేదు. సీపీఐ(ఎం) పోరాట ఫలింతగా పాత కొత్తగూడెంలో సాధించిన 40 ఎకరాల భూమిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేస్తున్న స్థలం కాకుండా, ఖాళీగా ఉన్న స్థలాన్ని పేదలకు పంచాలి. లేని పక్షంలో పాత కొత్తతగూడెంలోని భూమిని పేదలకు పంచుతాం. అర్హులైన పేదల ఇంటి నిర్మాణాకిని రూ.5లక్షలు ఇవ్వాలి. ప్రభుత్వం ఇప్పట్లో రెండు పడలకల ఇండ్లు కట్టి ఇచ్చే పరిస్థితిలో లేదు. కావున జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణాలు పూర్తియినవి వెంటనే పేదలకు పంచాలి. ఇండ్లు లేని వారికి ప్రభుత్వ స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలి. ప్రభత్వ స్థలం లేని ప్రాంతాల్లో పట్టా భూమిని కొనుగోలుచేసి పేదలకు ఇచ్చి, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలి.
- : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య