Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటుకు ఆధార్ అనుసంధానం 83 శాతం పూర్తి
- 05 జనవరి 23న తుది జాబితా ప్రచురణ
- అదనపు కలెక్టర్, నియోజకవర్గ ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఒకటో తేదీ జనవరి 23 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతీ యువతి, యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని అదనపు జిల్లా కలెక్టర్, అశ్వారావుపేట నియోజక వర్గం ఎన్నికల అధికారి కే.వెంకటేశ్వర్లు ప్రజలకు పిలుపునిచ్చారు. గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను ఆదివారం ఆయన స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటు నమోదు శిబిరాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల ఆదేశానుసారం సవరించిన ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల తొమ్మిదిన పోలింగ్ బూత్‌లు వారీగా పదర్శించడం జరిగిందని అన్నారు. ఈ జాబితా ప్రకారం నియోజక వర్గంలో 1 లక్షా 46 వేల, 91 మంది ఓటర్లుగా నమోదు అయ్యారని, శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటు నమోదు శిబిరాల్లో 2290 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. వచ్చే నెల డిసెంబర్ 3, 4 తేదీల్లో జరిగే ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుతం ఓటరు జాబితాలో నమోదై ఉన్న మృతులను, వివాహం చేసుకుని ఇతర నియోజక వర్గంలోకి వెళ్ళిన వారిని, దీర్ఘకాలం ఇక్కడ లేనివారిని స్థానిక అధికారులు ధృవీకరణతో పాటు బంధువులుకు నోటీసులు జారీ చేసి ఓటర్ల జాబితా నుండి తొలిగించాలని బూత్ లెవెల్ అధికారులకు సూచించారు. ఓటుకు ఆధార్ అనుసంధానం 83 శాతం పూర్తి అయిందని వివరించారు. 6 బి ఫాం ప్రకారం ఎవరికి వారు ఆన్ లైన్ ద్వారానూ నమోదు చేసుకోవచ్చని అన్నారు. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బాటు ప్రతీ పౌరుడికి బాధ్యత ఉందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్, నియోజక వర్గం సహాయ ఎన్నికల అధికారి చల్లా ప్రసాద్, ఎన్నికల డీటీ లావణ్య, బీఎల్ఓలు సోమాని ఉషా దేవి, రాజేశ్వరి, జ్యోతి, వాణి, మురళీ, నాగేంద్ర పాల్గొన్నారు.