Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు ప్రధమ శ్రేణి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు జస్టీస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జస్టీస్ డాక్టర్ రాధా రాణి. ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్‌లు ఆదివారం సందర్శించారు. ఈ సందర్బంగా జస్టిస్ రాధారాణికి మణుగూరు మెజిస్ట్రేట్ వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్మ విజయరావులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జస్టీస్ రాధారాణి మణుగూరు సబ్ డివిజన్ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలను జస్టీస్‌తో పాటు జిల్లా జడ్జి, జ్యుడిషియల్ అధికారులు నాటారు. కోర్టు భవనం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి అసోసియేషన్ న్యాయవాధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు విజయరావు కోర్టు భవనంలో మౌళిక సదుపాయాలు, సిబ్బంది కొరత, కక్షిదారుల కోసం మంచినీటి సదుపాయంతో పాటు మోబైల్ కోర్టు, ఎగ్జిక్యూటీవ్ జిల్లా కోర్టులలో శిక్షణ పొందిన జ్యుడిషియల్ అధికారులను నియమించేలా చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యలపై స్పందించిన జస్టిస్ రాధారాణి పది రోజుల్లో సిబ్బంది కొరతను తీర్చేందుకు కృషిచేస్తామన్నారు. మౌళిక సదుపా యాల విషయలంలో సమస్యలను విడివిడిగా నివేధిస్తూ వినతులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్ర మంలో కొత్తగూడెం జ్యుడిషియల్ అధికారులు బి.రామారావు, దీప, అసోసియేషన్ సభ్యులు చిర్రా రవి, రామ్మోహన్ రావు, శైలజ, అశోక్, కందిమళ్ల నర్సింహారావు, రామకోటయ్య, కిషన్, చొక్కయ్య, కవిత, సావిత్రి సంధ్య, విజయలక్ష్మి, వాసవి లావణ్య, పోశం భాస్కర్, నగేష్ కుమార్, సాంబ, సర్వేశ్వర రావు, కె.రవి, నాగార్జున రెడ్డి, సీఐలు ముత్యం రమేష్, శ్రీనివాస్, ఎస్ఐ రాజుకుమార్ పాల్గొన్నారు.