Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల కేంద్రమైన దుమ్ముగూడెం గ్రామానికి చెందిన పలువురు సీపీఐ(ఎం) చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, మాజీ డీసీసీబీ చైర్మన్ యలమంచి రవికుమార్ సమక్షంలో వివిధ పార్టీల నుండి బొర నూకా రెడ్డి, తాళ్లపూడి, నాగేశ్వరరావు, చల్లపల్లి, సాయి బాబు, అల్లాడి, మంగారాజు, జంగం రాజేష్, మామిడి గణేష్లకు వారు పార్టీ కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...పార్టీ నిరంతరం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిత్యం వారి పక్షాన పోరాడుతుందాన్నారు. రానున్న కాలంలో దుమ్ముగూడెం మండల ప్రజల అభివృద్ధి కోసం మరిన్ని ఆందోళన పోరాటాలు కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి శ్రీనుబాబు, దుమ్ముగూడెం శాఖ కార్యదర్శి బర్రి నర్సింహారావు, స్థానిక సర్పంచ్ మడి రాజేష్, సతీష్, ఎస్కే హుస్సేన్ మహమ్మద్, త్రినాధరావు, గణేష్ రెడ్డి, అల్లాడి రామకృష్ణ, రాంబాబు, వేణు, తదితరులు పాల్గొన్నారు.