Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గురుకుల కార్యదర్శి రోనాల్డ్ రాస్
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్యార్థులు అందివచ్చిన ప్రతి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాష్ట్ర గురుకుల కార్యదర్శి రోనాల్డ్ రాస్ అన్నారు. సోమవారం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని, రామవరంలో గల ఈయంఆర్ఎస్ పాఠశాలను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు, కలెక్టర్ అనుదీప్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సౌకర్యాలు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. విద్యార్థులు క్రీడలు ఆడుకునేందుకు వీలుగా క్రీడా మైదానం ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు నివాస క్వార్టర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వచ్చే సంవత్సరం నుండి కో-ఎడ్యుకేషన్ అయ్యే అవకాశం ఉందని, అందుకు బాలురకు ప్రత్యేకంగా డార్మెటరీ ఏర్పాటు చేయాలని సూచించారు. సైన్స్ ల్యాబ్‌లను, విద్యార్థుల తరగతి గదులను పరిశీలించారు. నిర్వహణ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గురుకులాల విద్యార్థులకు కార్పోరేట్గాయి విద్యను అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ కాపు సీతాలక్ష్మి, ఆర్సిఓ డేవిడ్ రాజు, ఈఈ తానాజి, డిఈ రాములు, తహసిల్దార్ రామ కృష్ణ, ఈయంఆర్ఎస్ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.