Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటియూ జిల్లా కార్యదర్శి ఏజె.రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
గిరిజన కార్పొరేషన్లో పని చేస్తున్న హమాలీలకు గత జనవరిలో కమిషనర్ సమక్షంలో జరిగిన ఒప్పందాల అమలుకు పునుకొకపోటే సమ్మెకి సిద్ధమవుతామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్ ప్రభూత్వాన్ని హెచ్చరించారు. కొత్తగూడెంలో స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బీసీసీ హమాలీ కార్మికుల యూనియన్ నాయకులు ఉప్పలయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏజె.రమేష్ మాట్లాడుతూ కమిషనర్ సమక్షంలో జిసిసి హమాలి కార్మికులకు వేతనం పెంచుతామని, బట్టలిస్తామని, బోనస్ ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఒక వారంలో సర్కులర్ ఇస్తామన్న కమిషనర్ ఇప్పటి వరకు సర్య్కులర్ విడుదల చేయలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీసీలను మూసివేసే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నదని, ఈ ఆలోచన విరమించుకోవాలన్నారు గత 25, 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న హమాలీలకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. జిసిసీ హామాలి కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి మొగిలి మాట్లాడుతూ ప్రజలందరికీ ప్రతి నెల మొదటి, చివరి వారాల్లో చౌక దుకాణాల ద్వారా బియ్యం అందించడంలో హమాలీల పాత్ర కీలకమని, అటువంటి హమాలీలు కష్టాన్ని ప్రభుత్వం గుర్తించకుండా పెట్టి చాకిరీ చేయించు కుంటుందని అన్నారు. ఈ సమావేశంలో జిసిసి హమాలీ నాయకులు సుబ్రమణ్యం, శ్రీను, రవి, రామూర్తి, బీరప్ప, లింగయ్య, ముత్యంరావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.