Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఒక ధళ సభ్యురాలు, ముగ్గురు మిలీషియా సభ్యులు జిల్లా పోలీసులు, సీఆర్పిఎఫ్ 81బెటాలియన్, 1418 వారి ఎదుట లొంగిపోయాని ఎస్పీ వినీత్.జి తెలిపారు. సోమవారం ప్రకటన విడుదల చేశారు. చత్తీష్‌ఘడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, రాంపూరం గ్రామానికి చెందిన మడవి మూయ దళ సభ్యురాలని, ఈమె గత రెండు సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన చంద్రన్న దళంలో సభ్యురాలుగా పనిచేస్తున్నదని, చర్ల మండలం కోరకట్ పాడు గ్రామం, రవ్వ దేవా మిలీషియా సభ్యుడు, గత మూడు సంవత్సరాలుగా చర్ల మిలీషియా సభ్యుడుగా కొనసాగుతూ పలు విధ్వంసకర పెసర్లపాడు ఎదురుకాల్పులలో పాల్గొన్నాడని తెలిపారు. చర్ల మండలం, బూరుగుపాడు గ్రామంకు చెందిన కొవ్వాసి గంగ, మిలీషియా సభ్యుడు సంవత్సర కాలంగా చర్ల మిలీషియా సభ్యుడిగా పనిచేస్తున్నాడని తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన వందొ దూలే, గత సంవత్సర కాలంగా చర్ల మిలీషియా సభ్యురాలిగా పనిచేస్తున్నదని చెప్పారు. మావోయిస్టు పార్టీ నాయకులు అమాయకపు ఆదివాసి గిరిజనుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, వారి దుర్మార్గపు చర్యలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని వీరు లొంగిపోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతము మావోయిస్టు సిద్ధాంతాలపై ప్రజలలో ఆదరణ లేకపోవడం వలన ఈ సిద్ధాంతాలు విజయం సాధించలేవనే నిర్ణయానికి వచ్చి ప్రశాంత జీవనం గడపాలని నిర్ణయించుకొని జిల్లా పోలీసు వారి సమక్షంలో లొంగిపోవడం జరిగిందని చెప్పారు.