Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గెలలు దిగుబడి,చీడపీడలపై అధ్యయనం
నవతెలంగాణ-అశ్వారావుపేట
పామ్ ఆయిల్ సాగు తొలిదశ తోటలను సోమవారం విదేశీ బృంద సభ్యులు పరిశీలించారు. అశ్వారావుపేట మండలం మద్దికొండ, అచ్యుతాపురం, జమ్మిగూడెం ప్రాంతాల్లో తొలిసారిగా సాగు చేసిన తోటలకు సంబంధించిన పామాయిల్ తోటలను మలేషియా, ఫ్రాన్స్, థైయిలాండ్ దేశాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు నీకోలాస్ త్రుణబుల్ (మలేషియా), డాక్టర్ సైలెవయిన్ (ఫ్రాన్స్) కుత్ చోలాధన్ (థైయిలాండ్), వైఎస్ రంగనాయకులు రిసోర్స్ ట్రైనింగ్ కన్సల్టెంట్, ఆయిల్‌ఫెడ్ సీనియర్ అధికారి బీ.రాజశేఖర్ రెడ్డి బృందం సందర్శించారు. ఈ పరిశీలనలో భాగంగా దాదాపు ఇరవై ఏడేళ్ల క్రితం మద్దకూరి వాసు దేవరరావు (1995), ఆలపాటి ప్రసాద్ (1995), కమ్మిలి ప్రసాద్ రాజు (1996)తో పాటు మరికొంతమంది రైతుల తోటలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేశారు. ఆయా రైతులతో మాట్లాడి.. తొలిసారిగా సాగు చేసిన పామాయిల్ తోటల నుంచి ఇప్పటి వరకు వచ్చిన దిగుబడులు, ఎత్తు, పొట్టి రకాలు, మట్టలు పొడవు, బరువు లాంటి వివరాలు, తోటలకు ఏ విధమైన తెగుళ్లు, చీడ పీడల గురించి సమగ్రంగా విశ్లేషించారు.