Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిన్నెరసానిలో ఘనంగా ఆరవ ఇంటర్ సొసైటీ క్రీడలు ప్రారంభం
- పాల్గొన్న కలెక్టర్, పీఓ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన విద్యార్థుల ప్రగతికి పెద్దపీట వేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ మైదానం భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఆరవ ఇంటర్ సొసైటీ లీగ్ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలకు రాష్ట్రవ్యాప్తంగా ఏడు సొసైటీల నుండి విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు. ఈ క్రీడలు కబడ్డీ అంశాలను జరగనున్నాయి. నాలుగు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడలను ముఖ్యఅతిథిగా హాజరై ఆయన ప్రారంభించారు. తొలుత పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న తర్వాత విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించి, ఉన్నత అధికారులు క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ విద్యతోనే గిరిజన బిడ్డలకు వికాసం కలుగుతున్నదని అన్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్య, వైద్యానికి పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. విద్య ఆవశ్యకతను గుర్తించిన సీఎం రాష్ట్రంలో 1000కి పైగా గురుకులాలను ఏర్పాటు చేశారని, కార్పొరేటుకు దీటుగా నాణ్యమైన విద్యనందిస్తున్నారని గుర్తు చేశారు. విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, చదువుతోపాటు క్రీడాలలోనూ రాణించాలని సూచించారు. క్రీడలలో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. ప్రభుత్వం కనిపిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అవరోధించాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థులు క్రమశిక్షణ అలవాటు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు, భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్, ఎటునాగారం ఐటీడీఏ పీవో అంకిత్ ఉట్నూరు, అరుణ్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ సొసైటీ అధికారి మల్లయ్య బట్టు, మైనార్టీ సంక్షేమ అధికారి రాష్ట్ర సెక్రెటరీ సేఫుల్ల, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోరం కనకయ్య, జడ్పీటీసీ వాసు దేవరావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ఎంపీపీ మోడీ సరస్వతి, ఐటీడీఓలు నరసింహారావు, తిరుమలరావు, చంద్రమోహన్, రూప దేవి, ఎంసీఎంఓ రమణయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుకృత, బి.రాములు, ఏఈ శ్రీకాంత్, హైదరాబాద్ క్రీడల అధికారి ప్రార్ధసాలది, హెచ్ఎం చందు, కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.