Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్ పాషా
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండల కేంద్రం నుండి అనిశెట్టిపల్లి గ్రామానికి డబుల్ రోడ్డుకి ప్రభుత్వ నిధులు వెంటనే మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్ పాషా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలో మండల కార్యవర్గ సమావేశం మండల కార్యదర్శి గొగ్గల కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఆళ్ళపల్లి మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి డబుల్ రహదారి లేక, ఉన్న సింగిల్ రోడ్డు కూడా గుంతల మయంగా ఉందని, దాంతో ప్రజలకు ప్రయాణం నరకప్రాయం మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య మానవుడికి అవసరమయ్యే నిత్యావసరాలతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందంన్నారు. సీపీఐ జిల్లా సమితి సభ్యులు, వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, సర్పంచ్ మెస్సు కోటేశ్వరరావు, మండల సహాయ కార్యదర్శులు నరెడ్ల రాంబాబు, పగడయ్య, వార్డు సభ్యులు రేసు సురేందర్, పీఏసీఎస్ డైరెక్టర్ సమ్మయ్య, మండల నాయకులు గుంతోజు శివ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి మండలోజు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.