Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సారపాక గ్రామ సభలో తీర్మానం
నవతెలంగాణ-బూర్గంపాడు
ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా లాక్కున్న పోడు భూములపై సర్వే నిర్వహించాలని, ఈక్రమంలో ఎఫ్ఆర్సీ ఆధ్వర్యంలో తీర్మానం చేయాలని పోడు రైతులు పట్టు బట్టారు. మండలంలోని సారపాక గ్రామపంచాయతీలో పోడు రైతుల గ్రామ సభ సోమవారం జరిగింది. పోడు సర్వే తీర్మానం ఆ తర్వాతే అందరికీ గ్రామ సభలో నమోదు చేస్తామని, గ్రామసభలో ఫారెస్ట్ అధికారులు లాక్కున్న భూముల్ని కూడా సర్వే చేయాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఎఫ్ఆర్సీ కమిటీ గ్రామసభలో 2020 డిసెంబర్ నెలలో పోడు రైతుల భూముల్ని బలవంతంగా ఫారెస్ట్ పోలీసు అధికారులు లాక్కున్న భూమిని కూడా సర్వే చేయాలని ఆయన అన్నారు. కందకాలు కొట్టి రైతుల భూముల్ని కూడా లాక్కున్న భూమిని కూడా సర్వే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ భూమిని సర్వే చేయాలని గ్రామ సభలో ఎఫ్ఆర్సీ కమిటీతో పాటు కొందరు గ్రామస్తులతో అంగీకరించటం జరిగింది. 2021 నవంబర్లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతుల అందరికీ సర్వే చేయాలని, ఎఫ్ఆర్సీ కమిటీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, వైస్ చైర్మన్ కనితి వాసు, పంచాయతీ సెక్రెటరీ మహేష్ బాబు, బీఆర్ఎస్ పార్టీ సారపాక పట్టణ అధ్యక్షులు కొనకంచి శ్రీను, సీపీఐ జిల్లా నాయకులు పేరాల శ్రీను, ఎం.కోటేశ్వరరావు, యు.సాలయ్య, చక్క నరసింహా రావు, భూక్యా రాజమ్మ, భూక్యా వాలియా తదితరులు పాల్గొన్నారు.