Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్యార్థినులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి అన్నారు. సోమవారం ఐద్వా కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ''విద్యార్ధినిలపై హింస'' అనే అంశంపై స్థానిక సిద్ధార్థ ఒకేషనల్ కాలేజీలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి, టౌన్ కార్యదర్శి సందకూరి లక్ష్మి మాట్లాడారు. రోజురోజుకు విద్యార్థులపై ప్రేమ పేరిట అత్యాచార ఘటనలు ఎక్కువవుతున్నాయన్నారు. అమాయక యువతులకు కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేసే వారి సంఖ్య ఎక్కువ అవుతుందని, దానివల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాలు మాత్రం వారికి రక్షణ కల్పించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. రాందేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఈసందర్భంగా తవ్రంగా ఖండించారు. సిద్ధార్థ ఒకేషనల్ కాలేజీ బృందం రాజ్యలక్ష్మి, అనూష, కవిత, భవాణి, శ్వేతా, విద్యార్థులు పాల్గొని మాట్లాడారు.