Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాలో గర్భిణిల్లో రక్తహీనత తగ్గించేందుకు ప్రభుత్వం అందచేస్తున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, కలెక్టర్ అనుదీప్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ ప్రారంభోత్సవ ఏర్పాట్లుపై వైద్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ మాసం నుండి నవంబర్ మాసాంతం వరకు కేసిఆర్ పోర్టల్లో నమైదైన గర్భిణిల జాబితా ప్రకారం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో 7360 మంది గర్భిణి మహిళలకు ఈ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో 11069 మంది గర్భిణీ మహిళలకు పరీక్షలు నిర్వహించగా 7023 మంది మహిళలు రక్త హీనతతో భాదపడుతున్నట్లు తేలినట్లు చెప్పారు. జిల్లాలోని 29 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, 5 యుపిహెచ్సీ, 4 సిఎఫ్ డబ్ల్యుసి కేంద్రాల్లో న్యూట్రిషన్ భద్రపరచడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమం విజయవంతం కావాలంటే న్యూట్రిషన్ కిట్లు తప్పనిసరిగా వినియోగించాలని చెప్పారు. రానున్న మూడు రోజుల్లో జిల్లాకు కిట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు. 13-27 వారాల్లో ఒకటి, 28-34 వారాల్లో ఒకటి అందచేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబునాయక్, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, అదనపు వైద్యాధికారులు డాక్టర్ శిరీష, డాక్టర్ శ్రీనివాసరావు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుజాత, డాక్టర్ చేతన్, డాక్టర్ నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.