Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయగిరి శ్రీనివాస్
నవతెలంగాణ-కొత్తగూడెం
బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం జాప్యానికి జాతీయ కార్మిక సంఘాలు కారణమని, వారిని నిలదీయాలని టీబీజీకేస్ నాయకులు, కార్మికుల మధ్య పేర్కొనడం ఇలాంటి అనుచిత వాక్యాలను సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటియూ) బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో కార్మికులను తప్పుదోవ పట్టించుట వారి అవగాహన రాయిత్యానికి నిదర్శనమని అన్నారు. వేజ్ బోర్డు ఆలస్యానికి కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదించబడిన (డిపిఇ గైడ్లైన్స్) మార్గదర్శకలకు అనుగుణంగా బొగ్గు గని కార్మికుల ఎన్సిడబ్ల్యూ ఏ-ఐ1,11వ వేతన ఒప్పందం జాయింట్ భైపార్టేట్ వేతన కమిటీ జేబీసీసీఐ చర్చలు జరపాలని కోల్ ఇండియా యాజమా న్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగిందన్నారు. ఈ గైడ్లైన్స్ ప్రకారం ఎగ్జిక్యూటివ్-ఇ-1 గ్రేడ్ కనీస బేసిక్ రూ.40 వేలు నెలకు అయితే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ టెక్నికల్ అండ్ సూపర్వైజర్ ఏ-1 గ్రేడ్ కనీస బేసిక్ దాటరాదని నిబంధనలో పేర్కొనడంతో కోల్ ఇండియా యాజమాన్యం చర్చలు ముందుకు సాగే ప్రయత్నం చేయడం లేదని పేర్కొన్నారు. డిపిఇ గైడ్లైన్స్ నిబంధనలు సడలింపు చేయాలని, రెండు-మూడు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరుపా లని జాతీయ కార్మిక సంఘాల నేతలు బిఎమ్ఎస్ మినహా సిఐటియు, ఏఐటియుసి, హెచ్ఎంఎస్ నాయకులు కేంద్ర మంత్రిత్వ శాఖను కలిసి లేఖను అందించాయని గుర్తుచేశారు. బిఎంఎస్ నాయకులు ఈ లేఖపై సంతకం చేయలేదని తెలిపారు. 30వ తేదీన కోల్ కత్తాలో ఏడవసారి జేబిసిసిఐ చర్చలు జరగనున్నాయని ఈ చర్చలకు కేంద్ర మంత్రిత్వ శాఖ నుండి డిపిఇ గైడ్లైన్స్ సవరిస్తున్నట్లు ఆదేశాలు వెలువడి కోల్ ఇండియా యాజమాన్యం గతం కంటే మెరుగైన వేతన ఒప్పందానికి సానుకూలంగా స్పందించాలని ఆశిద్ధామన్నారు. ఒకవేళ చర్చలు సానుకూలంగా జరుగని పక్షంలో జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చే పిలుపుకు కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. టీబీజీకేఎస్ నాయకత్వం కూడా మీనమేసాలు లెక్కించకుండా కేంద్ర ప్రభుత్వ విధించిన డిపిఇ గైడ్లైన్స్ సడలింపుకు, మెరుగైన వేతన ఒప్పందం కొరకు జరిగే పోరాటంలో కార్మికుల పక్షాన నిలబడాలని ఆయన హితవు పలికారు.