Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విస్తృతస్థాయి సమావేశంలో తీర్మానం
నవతెలంగాణ-మణుగూరు
తెలుగుదేశం పార్టీ పినపాక నియోజకవర్గ ఇన్చార్జిగా వట్టం నారాయణ దొరను నియ మించాలని, ప్రస్తుతం ఉన్న ఇన్చార్జ్ తాత మాధవిని తొలగించాలని టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. మంగళవారం వాసిరెడ్డి చలపతిరావు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇంచార్జ్‌గా కొనసా గుతున్న తాతమాధవి నియమాకం చెల్లదన్నారు. నియోజజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే వట్టం నారాయణదొరను నియమించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. అధిష్టానం వెంటనే పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అక్టోబర్ 30న రాష్ట్ర పార్టీ పరిశీలకులు నియోజకవర్గంలోని సమన్వయ కమీటీ సభ్యులు మండలాల అధ్యక్షుల అభిప్రా యాలు పరిగణలోకి తీసుకోకుండానే ఇంఛార్జ్‌ను నియమించారన్నారు. పార్లమెంట్ ఇన్చార్జ్ అభిప్రాయం కూడా తీసుకోలేద న్నారు. కావునా ఎన్నిక చెల్లదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం గెలుస్తుందన్నారు. ఈ సమావేశంలో ఏడు మండలాల అధ్య క్షులు తాళ్ళూరి జగదీశ్వరరావు, తుళ్ళూరి ప్రకాశ్‌రావు, కృష్ణ, వెంకటేశ్వర్లు, కమలాకర్, సాంబ య్య, నియోజకవర్గ సమన్వయ కమీటీ సభ్యులు, మహిళా రైతుసభ్యులు తదితరులు పాల్గొన్నారు.