Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కెసీఆర్ అని, పేద ప్రజల సంక్షేమమే ఆయన ధ్యేయం అని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం పాల్వంచ మండలం పరిధిలోని ప్రభాత్ నగర్ (రెడ్డిగూడెం), సంగెంలలో పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వనమా ప్రారంభించి, మాట్లాడారు. రైతులు ధాన్యం అమ్మడంలో దళారుల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారనే ఉద్దేశంతో ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి, అన్ని విధాల ఆదుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జిల్లా సహకార అధికారి ఎన్.వెంకటేశ్వరరావు, డీఎస్ఓ మల్లికార్జున బాబు, డీఎం త్రినాధ్ బాబు, డీటీఎస్ కృష్ణ, తహసీల్దార్ రంగా ప్రసాద్, ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, జడ్పీటీసీ వాసుదేవరావు, ఎంపీపీ మడివి సరస్వతి, వైస్ ఎంపీపీ గురవయ్య, సొసైటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.