Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్
నవతెలంగాణ-కొత్తగూడెంలీగల్
కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ అన్నారు. జిల్లా కోర్టు భవన సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ జిల్లా అధికారులతో మాట్లాడారు. కోర్టు పరిధిలో పాత కేసులకు త్వరితగతిన పూర్తి చేయాలని, జైల్లో ఉన్న ముద్దాయిలకు వారికి సంబంధించిన కేసులను రోజువారీగా విచారించాలని దొంగతనం జరిగిన ప్రాపర్టీ రికవరీ అయితే వెంటనే సంబంధిత ఓనర్కు ప్రాపర్టీని కోర్టు ద్వారా అందజేయుటకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఏం.శ్యామ్శ్రీ, జి. భానుమతి, ఆడేపు నీరజ, భత్తుల రామారావు, కె.దీప, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని రాధా కృష్ణమూర్తి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పివిడి లక్ష్మి, ఏపీపీలు పాల్గొన్నారు.