Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టు ఏర్పాటుకు మెచ్చా పట్టు పట్టారు : జిల్లా జడ్జీ
నవతెలంగాణ-దమ్మపేట
దమ్మపేట ఎస్సీ హాస్టల్ భవన సముదాయాన్ని మంగళవారం జిల్లా జడ్జి పసుపులేటి చంద్ర శేకర్ ప్రసాద్, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ నెల 26 భద్రాద్రి కొత్తగూడెం వచ్చిన హై కోర్ట్ జడ్జి రాధా రాణీని మర్యాదపూర్వకంగా కలిసిన మెచ్చా నాగేశ్వరరావు నియోజకవర్గంలో కోర్టు లేక ప్రజలు 80కి.మి.ప్రయాణం చేయాల్సి వస్తుందని, దీని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కోర్టు ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా నేడు జిల్లా జడ్జి పసుపులేటి చంద్ర శేకర్ ప్రసాద్, ఎమ్మెల్యేతో కలిసి భవనాన్ని పరిశీలించారు. అనంతరం జడ్జి, ఎమ్మెల్యే స్థానిక ప్రజా ప్రతినిదులు, నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ భవనం బాగుందని, చిన్న, చిన్న పనులు ఉంటాయని వాటిని త్వరగా పూర్తి చేస్తే కోర్టు వచ్చినట్లేనని కోర్టును ఎమ్మెల్యే పట్టు పట్టి సాధిస్తున్నారాని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కోర్టు ఏర్పాటు కోసం సీఎం కేసీఅర్ని కలవడంతో తప్పకుండా ఏర్పాటు చేస్తాననీ హామీ ఇచ్చాన్నారు. అలాగే జిల్లాకు వచ్చిన హై కోర్ట్ జడ్జి రాదా రాణీని కూడా కలిసి పనులు వేగవంతం చేయాలని కోరానని తెలిపారు. వెంటనే స్పందించి మంగళవారం జిల్లా జడ్జి వచ్చి భవనాన్ని పరిశీలించారన్నారు. త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బార్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, పీపీ రాధాకృష్ణ, బి.మాధవ రావు, బొర్రా వెంకట కృష్ణ, రామీసెట్టి రమేష్, అడ్మిన్ ఆఫీసర్ అనిత, అడ్వకేట్లు లక్కినేనీ నరేంద్ర, ఉడతనేనీ శ్రీనివాస్ రావు, ,రమణ, మారం సతీష్, జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ స్వామీ, మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డకుల రాజేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, ,వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, ,సర్పంచ్లు తోట రాజులు, చిన్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.