Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
ఎక్స్లెంట్ విద్యాసంస్థల విద్యార్థులను శాలువాలతో పుష్ప గుచ్చాలు అందజేసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఇల్లందు సింగరేణి హై స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ ఎగ్జిబిషన్ పోటీలలో భాగంగా మణుగూరు ఎక్స్లెంట్ స్టార్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎండి.రెయాన్ నఫీజ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్నోవేషన్ అనే నమూనాను ప్రదర్శించగా కేటగిరీలో మొదటి స్థానాన్ని గెలుచుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. 9వ తరగతి చదువుతున్న రితీష్ అనే క్విజ్ పోటీలలో ద్వితీయ బహుమతి గెలుచుకున్నరన్నారు. ఏడూళ్లబయ్యారం గ్రామం 9వ తరగతికి చెందిన విద్యార్థిని మారం రెడ్డి నవీతారెడ్డి, అంబులెన్స్ సాధారణ పరిస్థితిలో గైడ్ తీసుకుంటూ రూపొందించిన అంబులెన్స్ విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అయిందన్నారు. వారిని పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏది లేదని పేర్కొన్నారు. చదువులో కూడా రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు విజ్ఞానంతో పాటు మానవీయ విలువలు పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్లెంట్ విద్యాసంస్థల చైర్మన్ ఎండి యూసఫ్ షరీఫ్, ప్రముఖ వ్యాపారవేత్త ముక్కు నర్సారెడ్డి, ఎక్స్ లెంట్ విద్యాసంస్థల డైరెక్టర్లు ఖాదర్ షరీఫ్, యాకూబ్ షరీఫ్, బండారు నరేంద్ర, సురేష్, తదితరులు పాల్గొన్నారు.