Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ కల్పన రవికుమార్‌కు పలువురి ప్రశంసలు
నవతెలంగాణ-ఇల్లందు
ప్రభుత్వ కళాశాలలో చదువుకుని నర్సింగ్ కోర్స్ చేస్తున్న పేద విద్యార్థులకు రావుస్ హాస్పిటల్ నిర్వాహకులు గైనకాలజిస్ట్ డాక్టర్ కల్పన డాక్టర్ రవికుమార్ మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్థిక సహాయం అందించారు. పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత సంవత్సరం ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు పూర్తి చేసి బీఎస్సీ నర్సింగ్‌లో సీటు పొందిన ఎండి.సన, పాసి నవ్యశ్రీ విద్యార్థినులకు ఫీజులు, అడ్మిషన్, ఖర్చుల నిమిత్తం ఇద్దరికీ రూ.23 వేలు అందించారు. అంతేకాక మిగతా 3 ఏండ్లు ఫీజు కూడా తనే చెల్లిస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు. బిఎస్సి నర్సింగ్ కోర్స్ పూర్తి అయిన తర్వాత వారికి వారి హాస్పిటల్లో ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పి, విద్యార్థులకు ధైర్యాన్ని కలిగించారు. ఈ సందర్భంగా డా.కల్పన రవికుమార్ ఆర్థిక సహాయాన్ని అందిం చుటకు కృషి చేసిన కళాశాల ప్రిన్సిపల్ రామలింగేశ్వర రావు, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వారి మంచి హృదయానికి అభినందనలు తెలియజేశారు. పలువురు ప్రశంసించారు.