Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు బాల కళారత్న, జ్ఞానగంగ అవార్డులు
- ఉపాధ్యాయులకు ఆక్టివ్ టీచర్, ద్రోణాచార్య అవార్డులు
- డీఏవీ స్కూలుకు టెస్ట్స్కూలు అవార్డు
- అభినందించిన ఎంపీ డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి డీఏవీ స్కూలుకు అవార్డులు పంట కురిసింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, స్కూలుకు అవార్డులు వరించాయి. ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కళాభారతి ఛైల్డ్ ఆర్ట్ ఇనిస్టిట్యూషన్ వారు నిర్వహించిన చిత్రలేఖనం, హ్యాండ్ రైటింగ్, వ్యాసరచన పోటీల్లో డీఏవీ స్కూలు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. జి.బిపశ్విన్, జి.రుత్విక, ఎ.యోసిక్ సాయిరామ్, వి.శ్రీహర్షిత, ఎస్.రుత్విక్, వి.దేదీప్య, బి.శృతి, కుమారసౌరి, సీహెచ్ లిఖిత, పి.రుషిత హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభను కనబర్చి బాల కళారత్న అవార్డులను సాధించారు. జి.సాహితి, బి.హెచ్. మోక్షిత్వర్మకు వ్యాసరచన పోటీల్లో జ్ఞానగంగ అవార్డులు సాధించారు. జాతీయస్థాయి హ్యాండ్ రైటింగ్ పోటీలో వి.కవిత సిల్వర్ మెడల్‌ను కైవశం చేసుకొంది. విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చిన ఉపాధ్యాయిని జి.జ్యోతికి ఆక్టివ్ టీచర్ అవార్డు, హెచ్ఎం చిదానంద్ బి పనేగావ్కు ద్రోణాచార్య అవార్డును కళాభారతి ఛైల్డ్ ఆర్ట్ ఇనిస్టిట్యూసన్ వారు ప్రదానం చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిదానంద్ బి పనేగావ్ తెలిపారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు అవార్డులు రావడం పట్ల సాయిస్ఫూర్తి ఛైర్మెన్, ఎంపీ డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి, డీఏవీ తెలంగాణ జోన్-డి రీజనల్ అధికారి వీఎన్ఎస్కే శేషాద్రి, డీఏవీ స్కూలు ఛైర్మెన్ దాసరి ప్రభాకరరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద, సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ చెన్నుపాటి విజయకుమార్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.