Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి.
- ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి బుగ్గవీటి సరళ
నవతెలంగాణ-వైరా టౌన్
మహిళల పైన పెరుగుతున్న హింసను అరికట్టాలని, మహిళల రక్షణకు చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి బుగ్గవీటి సరళ డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న హింసపై ఐద్వా వైరా రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో వైరా మండలం రెబ్బవరం, పాలడుగు గ్రామాల హైస్కూల్స్ నందు మంగళవారం సెమినార్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గవీటి సరళ మాట్లాడుతూ మహిళల రక్షణకు ప్రభుత్వాలు అరకొర చట్టాలు చేసినా అమలులో చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు. మహిళా సాధికారతకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. అన్ని రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే మహిళా సాధికారతకు బీజం పడుతుందని అన్నారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ శివనారాయణ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు మెరుగు రమణ, వైరా రూరల్ మండల కార్యదర్శి షేక్ షైనాబి, నాయకురాల్లు షేక్ మజీద్ బి, ఎండి ఫాతిమా, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వనమా చిన్న సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తూము సుధాకర్, సిఐటియు మండల కన్వీనర్ బాజోజు రమణ, జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.