Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ పాల్వంచ
కేటీపీఎస్ 5, 6 దశలకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చీఫ్ ఇంజనీర్ ఎం.ప్రభాకర్ రావుతో పాటు ఎస్‌ఈ ఏటీఎం అకౌంట్స్ సెక్షన్ ఎస్‌ఏఓ పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి ఉన్నతాధికారులకు తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ 1535 నాయకులు ఘనంగా స్వాగత సుమాంజలు పలుకుతూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ సెంట్రల్ కమిటీ సభ్యులు పుట్ట నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దానం నరసింహారావు, శ్రీధర్, అంబాల శ్రీనివాస్, కె.సాంబయ్య, పివి సురేష్, కేటీపీఎస్ రీజినల్ ప్రెసిడెంట్ దానయ్య, కేటీపీఎస్ 5, 6 దశల రీజినల్ ప్రెసిడెంట్ అల్లాది పుల్లారావు, జనరల్ సెక్రెటరీ మాలోతు నాగేశ్వరరావు, కోశాధికారి జి.ఎల్లయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సీతయ్య, రీజినల్ నాయకులు ఆర్టిజన్ కార్మికుల నాయకులు నర్సిరెడ్డి1535 యూనియన్ మహిళా నాయకురాలు నాగమణి, మధులత అరుణ ఘనంగా సత్కరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.