Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడల వల్ల ఆరోగ్యం టీమ్ స్పిరిట్ పెంపొందుతాయి
- సింగరేణి డైరెక్టర్ ఈఅండ్‌ఎం డి.సత్యనారాయణరావు
- కోలిండియా ఇంటర్ కంపెనీ
- ఫుట్ బాల్ పోటీలకు ఆతిధ్యమిస్తున్న సింగరేణి
- ఘనంగా ప్రారంభమైన క్రీడా పోటీలు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కార్పొరేట్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో కోల్ ఇండియా స్ధాయి ఇంటర్ కంపెనీ ఫుట్‌బాల్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైనాయి. బుధవారం సింగరేణి డైరెక్టర్ ఈఅండ్‌ఎం డి.సత్యనారాయణరావు ప్రారంభించారు. ముందుగా కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ క్రీడా జండా ఆవిష్కరించారు. అనంతరం డైరెక్టర్ సత్యనారాయణ రావు మాట్లాడుతూ కోల్ ఇండియా స్ధాయి ఇంటర్ కంపెనీ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కి సింగరేణి కార్పొరేట్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం ఆతిధ్యమిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ క్రీడా వేడుకకు విచ్చేసిన అధికారులకు, క్రీడాకారులకు స్వాగతం పలికారు. దేశంలోని బొగ్గునలకు చెందిన 7 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, తెలంగాణ నుండి 9 టీంలు పాల్గొంటున్న ఈ మెగా ఫుట్ బాల్ టోర్నమెంట్ మన సింగరేణి కొత్తగూడెంలో జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. 2027 వరకు 1500 బిల్లియన్ టన్నుల ఉత్పత్తి సాధించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని తెలిపారు. సింగరేణిలో క్రీడలను ప్రోత్సహించడానికి ముఖ్య కారణం కార్మికుల ఆరోగ్యం అని, క్రీడల వల్ల టీమ్ స్పిరిట్ పెంపొందించుకొని ''ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం''గా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.
జరిగిన మ్యాచ్‌ల వివరాలు:ఈసిఎల్-ఎంసిఎల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈసిఎల్ 3-1 గోల్స్ తేడాతో ఎంసిఎల్ పై గెలిపొందింది. సిసిఎల్-ఎన్‌సిఎల్ మధ్య జరిగిన మ్యాచ్ లో సిసిఎల్ 5-3 గోల్స్ తేడా తో ఎన్‌సిఎల్‌పై గెలుపు సాధించారు. ఎస్‌ఈసిఎల్-బిసిసిఎల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఈసిఎల్ 3-0 గోల్స్ తేడాతో బిసిసిఎల్ పై గెలుపు సొంతం చేసుకుంది. జిఎం పర్సనల్ వెల్ఫేర్ కె. బసవయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఎంఓఏఐ అధ్యక్షులు జక్కం రమేష్, కొత్తగూడెం డిఎస్‌పి జి.వేంకటేశ్వర బాబు, గుర్తింపు సంఘం టిబిజికేఎస్ కార్పొరేట్ ఉపాధ్యక్షులు ఎం.సోమి రెడ్డి, ప్రాతినిధ్య సంఘం ప్రతినిధి డి.శేషయ్య, పర్సనల్ అధికారులు, స్పొర్ట్స్ సుపర్‌వైజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.