Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజేతలకు రూ.25వేల బహుమతులను అందించిన
- డాక్టర్ జిఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్
నవతెలంగాణ-కొత్తగూడెం
కల్యాణి సుమిత్ర డ్యాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన డాన్స్‌పోటీ విజయవంతంగా ముగిశాయి. డిసెంబర్3 ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కల్యాణి సుమిత్ర డ్యాన్స్ అకాడమీ వారి పోటీలు నిర్వహించారు. కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీల ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సులేషన్ బహుమతులు, సర్టిఫికేట్, మెమెంటోలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ అండ్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ జిఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గడల శ్రీనివాసరావు విజేతలకు డాక్టర్ జిఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కో-ఆర్డినేటర్ మోదుగు జోగారావు చేతుల మీదుగా విజేతలకు రూ.25వేల నగదు బహుమతులను, సర్టిఫికేట్, మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ ఆర్.వరలక్ష్మి కల్యాణి సుమిత్ర డ్యాన్స్ అకాడమీ నిర్వహకులు కళ్యాణ్, సుమిత్ర, మోదుగు జోగారావు, ఇమంది ఉదరుకుమార్ తదితరులు పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ అండ్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ జిఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గడల శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు.