Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.శ్యాంశ్రీ
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్
పేద బడుగు వర్గాల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎంతగానో శ్రమించారని తన జీవితాన్ని అంకితం చేశారని ఆ మహనీయుని జీవిత చరిత్ర నేటి యువతకు ఆదర్శం కావాలని కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.శ్యాంశ్రీ అన్నారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కొత్తగూడెం ఆధ్వర్యంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, గౌతమ్ నగర్, కొత్తగూడెంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రసంగిస్తూ. ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటామని దీనినే సంవిధాన్ దివాస్ అని కూడా అంటారని తెలిపారు. అంబేద్కర్ కృషితో రాజ్యాంగంలో రిజర్వేషన్‌ను పొందుపరిచారని కుల మతాలకతీతంగా నేడు విద్యాసంస్థలలో విద్యార్థులు చదువుకుంటున్నారంటే ఆ మహనీయుని కృషి తెలిపారు. రాజ్యాంగ రూపకల్పనలొ ఆయన చాలా కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుబ్రోలు రాంప్రసాదరావు, లీగల్ సర్వీసెస్ సభ్యులు తోట మల్లేశ్వరరావు, మెండు రాజమల్లు, కళాశాల ప్రిన్సిపల్ బి. రాజేశ్వరి, వైస్ ప్రిన్సిపల్ విజయ, కొత్తగూడెం వన్ టౌన్ ఎస్‌ఐ షాహిన్, లెక్చరర్స్ పి.అనురాధ తదితరులు పాల్గొన్నారు.