Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధుల్లో చేరిన గైనకాలజిస్ట్ స్వర్ణలత
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఎట్టకేలకు మెల్లమెల్లగా ప్రభుత్వ దవాఖానాలో స్పెషలిస్టులు వైద్యం అందుబాటులోకి వస్తుంది. అశ్వారావుపేటలో గల సామాజిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది నిపుణులైన వైద్యులు ప్రజలకు వైద్యసేవలు అందించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒకరో ఇద్దరో ఎంబిబిఎస్లతో ఆసుపత్రి నడుస్తుంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎంపీపీ శ్రీరామమూర్తి అశ్వారావుపేట అభివృద్దిపై దృష్టి సారించడంతో సామాజిక ఆరోగ్య కేంద్రంపై పలుమార్లు మంత్రి పువ్వాడ అజరు, కలెక్టర్ అనుదీప్ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో అమాత్యులు ఆదేశాలతో కలెక్టర్ ప్రత్యేక కృషితో డిసిహెచ్ఎస్ రవిబాబు ఈ ఆసుపత్రిలో వైద్యులను నియమించే పనిలో నిమగం అయ్యారు. ఈ కారణంతో ఇప్పటికే ఆరుగురు ఎంబిబిఎస్ వైద్యులతో పాటు ఆసుపత్రి వైద్యాధికారినిగా డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ జయలక్ష్మిని నియమించారు. ఇటీవల మరో స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలతను నియమించారు. వీరు బుధవారం విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఇరువురు ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులోకి వచ్చారు. వీరిని ఎంపిపి సన్మానించారు.