Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
రైతుల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. బుధవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన మణుగూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మణుగూరు తహసీిల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కేసిఆర్ పోడు భూముల సమస్యలపై పరిష్కరించకుండా కొట్లాట పెట్టి రాక్షసనందం పొందుతున్నాడని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక సభ్యులు రేగా కాంతారావు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఫారెస్ట్ వివాదం సృష్టించాడన్నారు. ఈ కార్యక్రమంలో ఏడు మండలాల అధ్యక్షులు పిరినాకి నవీన్, డి.కృష్ణారెడ్డి, ఓరుగంటి బిక్షమయ్య, గొడిశాల రామనాథం, ఇక్బాల్ హుస్సేన్, ముత్యమాచారి, చందా సంతోష్‌కుమార్, గంగిరెడ్డి వెంకటరెడ్డి, బీరం సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు కాటిబోయిన నాగేశ్వరరావు, గాదె కేశవరెడ్డి, బట్ట విజయ గాంధీ, పోలేబోయిన శ్రీవాణి, గురజాల గోపి పాల్గొన్నారు.
కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు
పినపాక : టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, రైతు, భూమి, వ్యవసాయ సమస్యలపై పినపాక నియోజకవర్గ కేంద్రంలోని మణుగూరు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చందా సంతోష్ కుమార్, పోలేబొయిన శ్రీవాణి, గంగిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు శ్రీవాణి మాట్లాడుతూ పోడు భూముల బాధితులు, ధరణి పోర్టల్ బాధితులు, రుణమాఫీ జరగని రైతులు, రైతు బీమా, రైతుబంధు బాధితులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తహసిల్దార్ కార్యాలయం లో వినతి పత్రం అందజేశారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా...:
హాజరైన మాజీ ఎమ్మెల్యే తాటి...
అశ్వారావుపేట : ధరణి రద్దు, పోడు భూములకు పట్టాలు కోరుతూ టీపీసీసీీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం చేపట్టిన తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అశ్వారావుపేట - సత్తుపల్లి రోడ్ లో పార్టీ కార్యాలయం నుండి తహశీల్ధార్ కార్యాలయం వరకు ముందుగా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పొట్టి శ్రీరాములు,అంబేద్కర్,మహాత్మా జ్యోతీ రావు ఫూలే విగ్రహాలు కు పూల మాలలు నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం తహశీల్దార్ ప్రసాద్ కు వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యురాలు సున్నం నాగమణి, మొగుళ్ళపు చెన్నకేశవరావు, సుంకవల్లి వీరభద్రరావు, మాజీ జెడ్పీటీసీ అంకత మల్లికార్జున్ రావు, ఎంపీటీసీ వేముల భారతి, ధన్జూ నాయక్ పాల్గొన్నారు.