Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సమస్యలపై కాంగ్రెస్ నిరసన
నవతెలంగాణ-కొత్తగూడెం
ధరణి, పోడు భూములు భూ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ నేతృత్వంలో కొత్తగూడెం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన అనంతరం తహసీల్దార్‌కు రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎడవల్లి కృష్ణ మాట్లాడారు. రైతు క్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. ధరణి, రైతు రుణమాఫీ, రైతు బీమా, రైతు బంధు అందేలా, రైతు పండించిన గింజకూ గిట్టుబాటు ధర చెల్లించి వెంటనే కొనుగోలు చేయాలని, రైతు పోడు భూమి సమస్యలు తక్షణం పరిష్కరించాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య, పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్, లక్మిదేవిపల్లి పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగరావు, చుంచుపల్లి మండల అధ్యక్షులు అంథొటి పాల్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు, పాల్వంచ మండల అధ్యక్షులు గద్దల రమేష్, బీసీ సెల్ చుంచుపల్లి మండల అధ్యక్షులు సిరంగి శ్రీనివాస్, లక్మిదేవిపల్లి మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్ పాల్గొన్నారు.
భద్రాచలం : భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలంలో రైతుల సమస్యలపై పోరుకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన, ధరణి పోర్టల్ రద్దు చేయాలని, రైతు భీమా, రుణ మాఫీ, పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని, పండించిన పంటకు గిట్టుబాటుధర కల్పించాలని, రైతుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరి నిరసిస్తూ స్థానిక అంబేద్కర్ సెంటర్లో రైతు దీక్ష చేపట్టారు. టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్,మాజీ గ్రంథాల చైర్మన్ బోగాలా శ్రీనివాస్ రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా కోఆర్డినేటర్ ఇందుల చిట్టిబాబు, చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్ జెలిల్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బంధం శ్రీనివాస్ గౌడ్,గండేపల్లి హనుమంతరావు,యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చింతరేళ్ళ సుధీర్,యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ ఎడారి ప్రదీప్,ఉబ్బ వేణు, తెల్లం నరేష్,రాంప్రసాద్, మహిళా కాంగ్రెస్ నాయకులు వసంతాల రాజేశ్వరి,పందాల సరిత,తుమ్మల రాణి,ఓంపోలు దేవకి,పుట్ట జానకీరాణి,హసీనా వసిమా దీక్షలో కూర్చోవడం జరిగింది. దీక్షలను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతరేళ్ళ రవికుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొలిశెట్టి రంగారావు, తాళ్లపల్లి రమేష్ గౌడ్, అడబాల వెంకటేశ్వరరావు దండలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతరేల రవికుమార్ టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన వారు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ఎస్.కె అజీమ్,కుంచాల రాజారాం, కొడాలి శ్రీనివాస్, బీఎస్పీ నాయకులు ఏవి రావు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్రాజ్, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు అలవాల రాజా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు ఉన్నారు.