Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన సిపిఎం నేతలు
- లబ్ధిదారులకు హక్కు పత్రాలు ఇవ్వకపోవడం శోచయనీయం ఎంబి నర్సారెడ్డి
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచల పట్టణంలోని ఏఎంసి కాలనీ సమీపంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లును 2018లో 88 మంది లబ్ధిదారులకు ఇచ్చారు, నేటికి ఎటువంటి హాక్కుపత్రాలు ఇవ్వలేదు, కావున తక్షణమే వారికి ఇంటి పన్నులు వేసి కరెంటు మీటర్లు వారి పేరుతో మార్పు చేయాలని కోరుతూ బుధవారం భద్రాచలం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో లబ్ధిదారులతో స్థానిక తాసిల్దార్ శ్రీనివాస్ యాదవ్, గ్రామ పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లుకి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి మాట్లాడుతూ 2018లో 88 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించి ఎటువంటి హక్కు పత్రాలు ఇవ్వకపోవడం శోషనీయమన్నారు. మరలా రెండో విడత కూడా డబల్ బెడ్ రూములు ఇచ్చే దానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నందున ఇచ్చిన వారికి వెంటనే ఇంటి పన్నులు వేసి కరెంటు మీటర్లు వారి పేరుతో మార్పించి వారికి హక్కులు కల్పించాల్సిందిగా అధికారులను కోరారు. సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి ఇంటి పన్నులు వేస్తామని ఆ విధంగా హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే బ్రహ్మచారి, పట్టణ కమిటీ సభ్యులు కుంజా శ్రీనివాస్, సుబ్బు, చారి, పాల్గొన్నారు.