Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం 2022 అవార్డు గ్రహీత - ఆదాం
- హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రముఖుల చేతుల మీదుగా ప్రశంస
నవతెలంగాణ-దుమ్ముగూడెం
నిరుపేద దళిత కుటుంబంలో మారుమూల దళితవాడలో జన్మించిన ఆ యువకుడు ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నత విద్యను అభ్యసించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలతో గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవారంగంలో విశేష కృషి చేస్తూ స్ఫూర్తి స్వేచ్ఛ సమానత్వం, సౌభృతత్వం, సమన్యాయం అనే అంశాలపై దళిత యువకుడు చేస్తున్న కృషికి దిశ గ్రామీణ అభివృద్ధి సంస్థ 73వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి 2022 పురస్కారానికి ఎంపిక చేసింది. మండలంలోని కాశీ నగరం గ్రామానికి చెందిన దళిత యువకుడు గడ్డం ఆదాం చిన్ననాటి నుండి ప్రభుత్వ విద్యను అభ్యసించి ఉన్నత విద్యావంతుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. స్ఫూర్తి పురస్కారానికి ఎంపికైన గడ్డం ఆదాంను బుధవారం హైదరాబాదులోని రవీంద్ర భారతి కళావేదికలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణలు స్ఫూర్తి పురస్కారం ప్రశంస పత్రంతో పాటు, శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా అభినందించారు. అభినందించిన వారిలో మాజీ పబ్లిక్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి, ఎర్రోళ్ల శ్రీనివాస్, తెలుగు సాహితి అకాడమీ చైర్మన్ గౌరీ శంకర్, ప్రముఖ వైద్యురాలు అనురాధ, ప్రముఖ న్యాయవాది సౌడ నవీన్, ప్రముఖులు అభినందించారు. ఈ అవార్డు రావటం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.