Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయట వ్యక్తుల ప్రలోభాలకు లొంగొద్దు
- పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
నవతెలంగాణ- నేలకొండపల్లి
కొంతమంది వ్యక్తుల రాజకీయ స్వార్థానికి విలువైన మీ జీవితాలను బలి చేసుకోవద్దని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ్డ అన్నారు. బుధవారం మండలంలోని గువ్వలగూడెం గ్రామంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ శాఖమూరి సతీష్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. తొలుత గ్రామంలో కోలాట నృత్యాలు, పాటలతో భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే కందాలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గువ్వలగూడెం గ్రామం గతంలో నిత్యం ఘర్షణలు కొట్లాటలకు నిలయంగా ఉండేదని, నేటికీ వాటిని కొనసాగించేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాలను ఖండించాలన్నారు. అటువంటి వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. గొడవలు పెట్టే రాజకీయాలు తనుకు తెలియదని, కేవలం ఎన్నికల నాడే రాజకీయాల గురించి మాట్లాడతానని అనంతరం అభివృద్ధికే పెద్దపీట వేస్తానన్నారు. పాలేరు నియోజకవర్గంలో బయట వ్యక్తులు పెత్తనం చెలాయిం చాలని చూస్తున్నారని, వారి కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. వారు చేస్తున్న స్వార్థపూరిత రాజకీయాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి పరిచే బాధ్యత తనదని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చిన అండగా ఉంటానని, పారిపోయే స్వభావం కాదని, సమస్య పరిష్కరించేంత వరకు పోరాడతానన్నారు. గ్రామానికి కావలసిన 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తానన్నారు. అదనంగా మరో 10 ఇండ్లు సొంతంగా నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో వనభోజనాలు నిర్వహించారు. నేలకొండపల్లి మండలంలో అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, ఎంపీడీవో కే జమలారెడ్డి, సిడిసి చైర్మన్ నెల్లూరి లీల ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నంబూరి శాంత, పార్టీ కార్యదర్శి ఎన్నబోయిన శ్రీను, కోటి సైదారెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు గండు సతీష్ నంబూరు సత్యనారాయణ, అనగాని నరసింహారావు, వజ్జా శ్రీనివాసరావు, సర్పంచులు భూక్య సుధాకర్, మందడి రాజేష్, నెల్లూరి అనురాధ, ఈజీఎస్ ఏపీవో ఆర్ సునీత, ఐకెపి ఎపిఎం అశోక్ రాణి తదితరులు పాల్గొన్నారు.