Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోటారుసైకిలుపై తిరుగుతూ ఎమ్మెల్యే సండ్ర చెక్కుల పంపిణీ
నవతెలంగాణ- సత్తుపల్లి
కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇలా ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ సాయమైనా లబ్ధిదారుల ఇండ్ల వద్దకే నేరుగా వెళ్లి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గత కొంత కాలంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అమలు పరుస్తున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం సత్తుపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో మోటారుసైకిలుపై తిరుగుతూ లబ్ధిదారులకు ఆయా పథకాల చెక్కులు, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందిన సాయాన్ని పంపిణీ చేశారు. ఇదే సందర్భంలో ఆయా వార్డుల్లో ప్రమాదాల్లో గాయపడిన వారిని, ఇంటి పెద్దదిక్కును, తోబుట్టువులను కోల్పోయిన కుటుంబాలను పరామర్శిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాల్లో క్షతగాత్రులై ప్రయివేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఎవరైనా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోనట్లయితే ఆయా వార్డు కౌన్సిలర్లు అట్టి వారిని గుర్తించి దరఖాస్తు చేసుకొనేలా చూడాలని కౌన్సిలర్లు, నాయకులను కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావునగర్, ఎన్టీఆర్నగర్, జవహర్‌నగర్, కల్పతరు రోడ్డు ప్రాంతాల్లో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, పట్టణ టీఆర్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, కౌన్సిలర్లు చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌కుమార్, నాగుల్‌మీరా, రాఘవేంద్ర, మారుతి సూరిబాబు, నాయకులు నడ్డి ఆనందరావు, దొడ్డాకుల గోపాలరావు, మహమ్మద్ గఫార్, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.