Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకరుల సమావేశంలో అకాడమీ డైరెక్టర్లు సతీష్ బాబు, భరణి కుమార్
నవతెలంగాణ- ఖమ్మం
నీట్ 2022 ద్వారా పూర్తి చేసే మెడికల్ సీట్ల 2వ దశ ప్రక్రియ మంగళవారం ముగిసిందని, ఈ ఫలితాలలో గవర్నమెంట్ కోటాలో ఒకే సంస్థ, ఒకే సంవత్సరంలో 74 మందికి మెడికల్ సీట్లు సాధింపచేసి, ఖమ్మం పేరును రెండు తెలుగు రాష్ట్రాలలో ఇనుమడింపచేసిన ఘనత ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమీ సాధించిందని అకాడమీ డైరెక్టర్లు రాయల సతీష్ బాబు, ఈగా భరణి కుమార్ హర్షాన్ని వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మంలోని ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత సంవత్సరం '49' మందికి గవర్నమెంటు కోటాలో ఎంబీబీఎస్ సాధింపజేసి చరిత్ర లిఖించారు. మళ్ళీ అదే సంస్థ 74 మందికి గవర్నమెంటు ఎంబీబీఎస్ సీట్లను తేవడం ద్వారా చరిత్రను తిరగరాశారని తెలిపారు. మెడికల్ సీట్లు తేవడం కాకుండా ఏఐఐఎంఎస్, అండ్ జేఐపిఎంఈఆర్ సంస్థలలో కూడా డాక్టర్ కోర్సు ప్రవేశాలకు అవకాశం కల్పిస్తుండటం చాలా ప్రశంశనీయమని, వ్యయ ప్రయాసలకు ఓర్చి ఇతర ప్రాంతాలకు వెళ్తూ అధిక సంఖ్య ఉన్న కార్పోరేట్ సంస్థలలో చేరి ఫలితాలు రాకా ఇబ్బంది పడ్తున్న ఖమ్మం ప్రాంత, పరిసర ప్రాంత విద్యార్థులకు ఈ సంస్థ ఒక వరమని, సాధారణ విద్యార్థులకు కూడా మెడికల్ సీటు తెప్పించగల దమ్మున్న సంస్థ డాక్టర్స్ మెడికల్ అకాడమీ అన్నారు. ఈ సంస్థ ద్వారా 720 మార్కులకు 670 మార్కులు ఒక విద్యార్థి తెచ్చుకున్నాడంటేనే అర్థం అవుతుందని ఈ సంస్థ సామర్థ్యం అన్నారు. ఎన్ని కఠిన సమస్యలు ఉన్నా అకాడమీ నిర్విరామంగా, నిరాటంకంగా నడపగల యాజమాన్యం విద్యార్థులు కఠినంగా భావించే ఫిజిక్స్, కెమిస్ట్ర సబ్జెక్టులు చెప్పే అధ్యాపకులే యాజమాన్యం కావడం అకాడమీకి చాలా కలిసోచ్చే అంశమన్నారు. వేరే జిల్లాలనుండే కాకుండా వేరే రాష్ట్రాలనుండి కూడా నీట్ కోచింగ్ కోసం మన ఖమ్మంలోని ఈ అకాడమీకి తరలివస్తున్నారంటే, ఈ అకాడమీ మన ఖమ్మంలో ఉండటం మన అదృష్టం కాదంటారా అని అన్నారు.