Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్
- ఆర్డీఓకి వినతి
నవతెలంగాణ-ఖమ్మం
రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసరం మేరకు, సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క సూచన మేరకు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో వెంటనే రుణమాఫీ చేయాలని, గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన పంట నష్టాలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. ధరణి పోర్టల్ రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని, ఏదైతే ప్రాజెక్టుల నిర్మాణం వలన ప్రతి ఏట ముంపునకు గురి అవుతున్న ప్రాంతాల భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవోకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు, 8 వ డివిజన్ కార్పొరేటర్ లాకావాత్ సైదులు, 5 వ డివిజన్ కార్పొరేటర్ పల్లేబోయిన భారతి చంద్రం, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కోటేరు నర్శి రెడ్డి, మాజీ కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు,ఖమ్మం మైనారిటీ నగర అధ్యక్షులు అబ్బాస్, ఓబిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షులు గజ్జెలీ వెంకన్న, సెల్ నగర అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, ఖమ్మం డివిజన్ అధ్యక్షులు బోజెడ్ల సత్య నారాయణ పాల్గొన్నారు.