Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కౌలు రైతుల దగ్గర ఎటువంటి ఆంక్షలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. కరెంటు కోతలు లేకుండా 24 గంటల కరెంటు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కేరళ తరహాలో రూ.2800 గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో ఓటీపీ పద్ధతిని ఎత్తివేయాలని అన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రైతుబంధు పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, పోడియం వెంకటేశ్వర్లు, మాలోతు రావుజా, గౌరీ నాగేశ్వరరావు, వూకంటి రవికుమార్, నిమ్మల మధు, కుంజ రామ్మూర్తి, పద్దం తిరుపతమ్మ, ముదిగొండ రాంబాబు, బుగ్గ వెంకట నరసమ్మ, బేతి అమల, జి.దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.