Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుజాతనగర్
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడదామని సీఐటీయూ జిల్లా నాయకులు వీర్ల రమేష్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మెయిన్ సెంటర్ నందు సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుడిపై పెనుబారం మోపిందని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ లేబర్ కోడ్లు రద్దు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం వంటి వాటిని పోత్రహిస్తున్నారని అన్నారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడుట కోసం మోడీ గద్దె దిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చింతాల శ్రీనివాసరావు, శంకర్, వసంత, రాజు, నరసింహారావు పాల్గొన్నారు.