Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేంజర్ హత్య ముమ్మాటికీ ప్రభుత్వ అలసత్వం వల్లే జరిగింది
నవతెలంగాణ-చండ్రుగొండ
బెండలపాడు గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రబోడు గ్రామాన్ని శుక్రవారం తెలంగాణ జన సమితి(టీజేఎస్)వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం బృందం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారంలో పోడు భూముల ఘర్షణలో మరణించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతికి నివాళులర్పించారు. వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు. పోడు భూముల విషయాల్లో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబించడం వల్లే రాష్ట్రవ్యాప్తంగా గొడవలు జరుగుతున్నాయన్నారు. ఇద్దరూ వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో రేంజర్ మరణించడం బాధాకరమని అన్నారు. దాన్ని సాకుగా తీసుకొని 45 కుటుంబాలు జీవిస్తున్న ఎర్రబోడు గ్రామాన్ని బెండలపాడు పంచాయతీలో తీర్మానం చేసి బహిష్కరించడం సరికాదన్నారు. ఈ విషయంపై ట్రైబల్ కోర్టులో మానవ హక్కుల సంఘంలో పిటీషన్ దాఖలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శిలు మల్లెల రామనాథం, గోపగాని శంకర్రావు, ఎమ్మెస్‌పి జిల్లా నాయకులు చాపలమడుగు వెంకటేశ్వర్లు, అన్నపురెడ్డిపల్లి మండల ఎంఆర్పిఎస్ ఇంచార్జ్ జుంజు నూరి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.