Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గడప గడపకి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి
- ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ-దమ్మపేట
కల్యాణ లక్ష్మి చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిదులు, నాయకులతో కలిసి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం 17 కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లితండ్రులకు అమ్మాయి పెండ్లి బారం అవ్వకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఅర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కేసీఅర్ ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, మనం కోట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో మన పాలనతో అధ్బుతంగా అభివృద్ధిని సాధించుకుంటునామన్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌లు బ్యాంకు ఎకౌంట్లో పడినప్పటికీ కొన్ని బ్యాంకుల వారు ఆ డబ్బును లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనే సమస్యను ఎమ్మెల్యేకి తెలియజేయగా వెంటనే స్పందించి ఎండీఓతో ఫోన్‌లో మాట్లారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వామి, మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, సర్పంచ్‌లు ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు, దుర్గ, ఉప సర్పంచ్ దారా యుగంధర్, పగడాల రాంబాబు, కొయ్యల అచ్యుత్ రావు, రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి పేదవానికి అండగా కేసీఆర్ : ఎమ్మెల్యే
ములకలపల్లి రాష్ట్రంలో ప్రతి పేదవానికి సీఎం కేసీఆర్ అండగా ఉంటారని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని 25 మంది లబ్దిదారులకు రూ.28లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోమారు అధికారంలోకి టీఆర్‌ఎస్ రావాలంటే ప్రజలంతా కేసీఆర్కు అండగా నిలవాలన్నారు. అనంతరం ఆయన నల్లమూడిలో రూ.1.60కోట్లతో మంజూరైన బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. అదేవిధంగా టేకులగుంపులో గుండెపోటుతో మృతిచెందిన పాండ్ర నరేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబసభ్యులకు సంతాపం, సానుభూతి తెలిపారు. గండిప్రోలులో కుర్సం వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులను పరామర్శి ంచారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వీరభద్రం, ఎంపీడీవో చిన్న నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, మండల కార్యదర్శి శెనగపాటి అంజి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.