Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి, రెండు కోట్ల 70 లక్షలు, అదే విధంగా మోతే పుష్కర ఘాటుకి కోటి 20 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు ప్రత్యేక కృతజ్ఞతలను జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావులు తెలిపారు. బూర్గంపాడులో శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కారం చూపిస్తున్న అభివృద్ధి ప్రధాత రేగా కాంతారావుకు మండల ప్రజానీకం తరఫున ప్రత్యేక ధన్యవాదాలను వారు తెలిపారు. ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో గ్రామాలకు మహార్థశ పట్టనున్నదని వారు పేర్కొన్నారు. నిధులు మంజూరు చేపించిన ఘనత రేగాకు దక్కుతుందని వారు అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రేగా కాంతారావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, బూర్గంపాడు పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు గోనెల నాని, ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరి పల్లి వంశీకృష్ణ, భూపల్లి నరసింహారావు, మైనార్టీ అధ్యక్షులు సాదిక్, మైనార్టీ సెల్ నాయకులు షాబీర్ పాషా, ఉపాధ్యక్షులు చెన్నం రవి, ప్రచార కార్యదర్శి తోకల సతీష్, మండల నాయకులు మంద ప్రసాద్, కన్నేపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.