Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4న యూటీఎఫ్ జిల్లా మహాసభలు
- జిల్లా కార్యదర్శి బి.రాజు
నవతెలంగాణ-మణుగూరు
యూటీఎఫ్ జిల్లా 4వ విద్యా వైజ్ఞానిక మహాసభలో విద్యా, ఉపాధ్యాయులు సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రాజు అన్నారు. శుక్రవారం స్థానిక కో ఎడ్యుకేషన్ పాఠశాలలో విలేకరులతో మాట్లాడుతూ డిసెంబర్ 4వ తేదీన అమరజీవి కామ్రేడ్ నాగటి నారయణ జిల్లా ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యా వైజ్ఞానిక మహాసభలు నిర్వహిస్తున్న మన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చావా రవి, ఉపాధ్యాక్షు రాలు దుర్గా భవాని, డీఈఓ సోమశేఖరవర్మ హాజరు అవుతున్నారన్నారు. మహాసభకు ముందు విద్యా ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలపై సెమీనార్ జరుగు తుందన్నారు. అనంతరం మహాసభ నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటలకు ఉపాధ్యాయ మహాప్రదర్శన సురక్షాబస్టాండ్ నుండి జడ్పిఎస్‌ఎస్ కో ఎడ్యుకేషన్ పాఠశాల వరకు ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు బి.కిశోర్‌సింగ్, జిల్లా కార్యదర్శులు రాము, బిక్కు, సీనీయర్ ఉపాధ్యాయులు ఇంద్రసేనారెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు మీరాహుస్సేన్, కారం సీతారామయ్య, విజరుభాస్కర్, రాజారావు, కిరణ్ శ్రీనీవాస్, భాస్కర్‌రావు, రాము, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
పినపాక : 4న మణుగూరు పట్టణంలో అమరజీవి నాగటి నారాయణ ప్రాంగణంలో జెడ్పీఎస్‌ఎస్ పాఠశాల నందు జరుగనున్నట్టు యూటీఎఫ్ జిల్లా కోశాధికారి ఇంద్రసేనారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి భాస్కరరావు తెలియజేశారు.
శుక్రవారం పినపాక మండలం ఈ బయ్యారంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో మణుగూరు మండలం యుటిఎఫ్ అధ్యక్షులు షేక్ మీరా హుస్సేన్, విజయ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.