Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యుటిఎఫ్
నవతెలంగాణ-మధిర/కూసుమంచి/కామేపల్లి
నూతన విద్యా విధానాన్ని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం టీఎస్ యుటిఎఫ్ మధిర యూనిట్ ఆధ్వర్యంలో జీపు జాతా స్థానిక బాలికల ఉన్నత పాఠశాల, ఆర్.వి. కాంప్లెక్స్ ప్రాంతంలో మండల అధ్యక్షులు ఏ.వినోద్ రావు అధ్యక్షతన జరిగింది.ఈ కారక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి న నూతన జాతీయ విద్యా విధానం 2020 విద్యలో కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ పెంచి పోషించేదిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ నాయకులు కస్తూరి బాయి, వీరయ్య, అనుమోలు కోటేశ్వరరావు,భీమ శంకర రావు, భాస్కర రావు పాల్గొన్నారు.
కామేపల్లిలో మండలంలోని కొమ్మినేపల్లి, ముచ్చర్ల, కామేపల్లి హైస్కూల్, ఆశ్రమ పాఠశాలలలో ప్రచార జాత నిర్వహించారు. టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు బి. రాందాస్, డిఎస్ నాగేశ్వర రావు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎం నరసింహ రావు, సోమయ్య చారి పాల్గొన్నారు.కూసుమంచి మండలంలోని జీపు జాతా కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జి.నాగమల్లేశ్వర రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షమీ, జిల్లా కార్యదర్శి మండవ నర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి పి.కృష్ణారావు, కార్యదర్శులు యస్.శ్రీనివాస రాజు పాల్గొన్నారు.