Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య
నవతెలంగాణ-భద్రాచలం
ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్. అంబేడ్కర్ అని భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం భద్రాచల అంబేద్కర్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పుట్టడం భారతదేశ ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. అంబేద్కర్ ఆలోచనలు పాటించడం, అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్, టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్, జిల్లా సెల్ అధ్యక్షులు చింతిరేల రవికుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోగాల శ్రీనివాస్ రెడ్డి, బంధం శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ కు ఘన నివాళులు
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. బిఏ ఇంచార్జ్, అకాడమిక్ కోఆర్డినేటర్ వేముల కామేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రిన్సిపాల్ దొడ్డి భద్రయ్య పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అకాడమిక్ కోఆర్డినేటర్ వి. కామేశ్వరరావు, డి. వీరన్న, శ్యాం ప్రసాద్, ఎం. కిరణ్ కుమార్, వీరాస్వామి, వెంకటేశ్వర్లు, బాలాజీ, సురేష్, వేణు, భవాని, సాంబయ్య, వెంకటరమణ, విద్యార్థులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించిన ప్రజాసంఘాలు
చర్ల :భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. తొలుత స్థానిక అంబేద్కర్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మండలం అధ్యక్షులు బోళ్ల వినోద్ అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం చర్ల మండలం ప్రధాన కార్యదర్శి మచ్చ రామారావు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి మెరుగైన ఉచిత విద్య ,వైద్య సదుపాయాన్ని కల్పించాలని చర్ల మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం రెండు ఎకరాలు స్థలంలో వెంటనే నిర్మాణం చేపట్టాలని చర్ల మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయం అన్ని వసతులతో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అనంతరం చర్ల మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ సిరిపురపు శివ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సిపిఎం పార్టీ చర్ల కార్యదర్శి కారం నరేష్, పొడుపుగంటి సమ్మక్క, షారోని, శ్రీ కల, పలక సూరమ్మ, వరదల వరలక్ష్మి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నరసింహ, కార్యకర్తలు, ఎన్.మూర్తి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.