Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా అధ్యక్షులు మచ్చా
నవతెలంగాణ-కొత్తగూడెం
భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే డాక్టర్ బీఆర్.అంబేద్కర్‌కి ఇచ్చే ఘన నివాళి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జ సురేష్‌లు అన్నారు. మంగళవారం కొమరం భీం కాలనిలో వ్యకాస, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్థంతి సభ వజ్జ సురేష్ అద్యక్షతన జరిగింది. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి మచ్చా వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ భారతదేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సామాజిక విప్లవానికి నాంది పలికింది అంబేద్కర్ అని, నిమ్న కులాల అభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన మహానాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లిక్కి బాలరాజు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ భూక్యా రమేష్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు డి.వీరన్న, ఇండ్ల స్థలాల పోరాట కమిటీ కో- కన్వీనర్ బాలకృష్ణ, ప్రేమ్ కుమార్, సిద్దెల రాములు, క్రిష్ణ, రమ, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ ఆధ్వర్యంలో : అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో, పోస్ట్ ఆఫీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ గంధం మల్లికార్జున రావు, సాయి, మాలోత్ వీరు నాయక్, చేనిగారపు నిరంజన్ కుమార్, నాగుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : అంబేద్కర్ ఆశయాలను ప్రభుత్వం సాధి స్తుందని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం అంబేద్కర్ వర్ధంతిని మణుగూరులో నిర్వ హించారు. శాసనసభ్యులు క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్ర హానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం రేగా మాట్లాడారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కేవీపీిఎస్ ఆధ్వర్యంలో : కెవిపిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కొడిశాల రాములు మాట్లాడారు. మండల కార్యదర్శి నాగేల్లి శ్రీను, రాజేష్, గుర్రం నరసయ్య, నరసింహారావు, వీరయ్య, తేజశ్రీ, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో : మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. మండల అధ్యక్షులు గురజాల గోపి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బూర్గుల నరసయ్య, నూరుద్దీన్ షరీఫ్, సతీష్, రాజా, సాంబశివరావు, సాబీర్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం), కేవీపీఎస్ ఆధ్వర్యంలో
ఇల్లందు : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేత్కర్ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) మంగళవారం నివాళి అర్పించింది. వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సీనియర్ నాయకుడు దేవుల పల్లి యాకయ్య, అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, కూకట్ల శంకర్, సోమ కృష్ణ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్ ఆధ్వర్యంలో : అంబేద్కర్ స్ఫూర్తితో అంటరానితనానికి, కుల నిర్ములనకు, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా నాయకులు మన్నెం మోహనరావు పిలుపునిచ్చారు. నెహ్రు నగర్ ఏరియాలో అంబేద్కర్ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాషా, మమతా, దుర్గ, అనూష, రాజు లు పాల్గొన్నారు.
భద్రాచలం : కేవీపీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజుపేట కాలనీలో అంబేద్కర్ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డి.లక్ష్మీ, పిల్లల లక్ష్మీకాంత, రామకృష్ణ, కేవీపీఎస్ నాయకులు చేగొండి శ్రీనివాసరావు, గుండె రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఎన్జీఓస్ ఆధ్వర్యంలో
ఎన్జీవోస్ ప్రెసిడెంట్ డెక్క నరసరావు, కార్యదర్శి గగ్గూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అసోసియేట్ ప్రెసిడెంట్ కట్టుకూరి నాగభూషణం, ట్రెజరర్ పడిగ నరసింహారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు లింగమూర్తి, గాంధీ, అనిల్ కుమార్, అంజిబాబు, రాజు, అన్వర్ తదితర ఉద్యోగస్తులు పాల్గొన్నారు.
అంబేద్కర్ సెంటర్లో అన్నదానం
భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పౌల్ రాజ్ ఆధ్వర్యంలో 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లాడి పౌల్ రాజ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతిర్యల రవి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్, బీఎస్పీ పార్టీ నాయకులు కేసు పాక కృష్ణ, గిరిజన నాయకులు, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.
టేకులపల్లి : కోయగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు బి.అమర్ సింగ్, స్టాఫ్ సెక్రటరీ ఈ.ముత్తయ్య, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు ఘనంగా నివాళులు అర్పించినట్లు మంగళవారం తెలిపారు. ప్రధానో పాధ్యాయులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు రాజు, సైదులు, శారద, పాపారావు, శ్రీనివాస్, నాగేశ్వరరావు, కస్నా, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : అంబేద్కర్ 66వ వర్దంతిని మంగళవారం పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి ఎం.శ్రీనివాసరావు, ఇంచార్జ్ ప్రిన్సిపాల్ వై.మల్లికార్జునరావు ఆద్వర్యంలో విద్యార్ధులు మహపరినిర్వాన్ కార్యక్రమం నిర్వహించారు. లకీëనగరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు లంకా శ్రీనివాసరావు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లకీëనగరం పార్టీ కార్యాలయంతో పాటు ములకపాడు గ్రామంలో గల అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీపీ రేసులకీë, జెడ్పీటీసి తెల్లం సీతమ్మ, పార్టీ మండల అద్యక్ష కార్యదర్శులు అన్నె సత్యనారాయణమూర్తి, కణితి రాముడు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. బీఎస్పీ పార్టీ ఆద్వర్యంలో నర్సాపురం, ముకపాడులో వర్ధంతి నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి డివిజన్ కన్వీనర్ వీసం పల్లి నర్సింహారావు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. నర్సాపురం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆళ్ళపల్లి : భారత రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ అని ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి అన్నారు. ఈ మేరకు మంగళవారం అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని మండల కేంద్రములోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాబా, సహాయ కార్యదర్శి మొహమ్మద్ ఖయ్యుం, ఆర్గనైజింగ్ కార్యదర్శి, సీనియర్ మండల నాయకుడు ఎం.డీ అతహార్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని వైఎస్సార్ టీపీ మండల కన్వీనర్ కరకపల్లి సుధాకర్ కొనియాడారు. ఈ మేరకు మంగళవారం అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకుని మండల కేంద్రములో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ములకలపల్లి : మండల పరిధిలోని జగన్నాధపురంలో అంబేద్కర్ యూత్ (ఏజెన్సీ దళిత సేవాసంఘం) ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సీతాయిగూడెం సర్పంచ్ కారం సుధీర్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ జబ్బార్, పంచాయతీ కార్యదర్శి ఎండి. ఇబ్రహీం, ఏజెన్సీ దళిత సేవాసంఘం మండల అధ్యక్షుడు చిట్లూరి వెంకట్, సీపీఐ మండల కార్యదర్శి ఎండి.యూసప్, రక్షణ సేవాసమితి మండల అధ్యక్షుడు హరికృష్ణ, నాగుబాబు, తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
వ్యకాస ఆధ్వర్యంలో : ములకలపల్లిలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో వ్యకాస ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ మండల అధ్యక్షుడు ముదిగొండ రాంబాబు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనర్సయ్య, వర్సా శ్రీరాములు, బండారి కొండయ్య, విమల తదితరులు పాల్గొన్నారు. ు
పినపాక : అంబేద్కర్ వర్ధంతిని మండల వ్యాప్తంగా నిర్వ హించారు. అన్ని పార్టీ కార్యాలయాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పాఠశాలల్లో వర్ధంతి నిర్వహించారు. నేతకాని సంఘం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామ నాథం ఆధ్వర్యంలో ఈ బయ్యారం క్రాస్ రోడ్లో వర్ధంతి నిర్వహించి, హాస్పిటల్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
అశ్వారావుపేట : అంబేద్కర్ వర్థంతి సందర్భంగా స్థానిక మూడు రోడ్ల కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి పూల మాల వేసి నివాళి అర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు నార్లపా టి రాములు, సుదర్శన్, నారాయణ, గందం వెంకటేశ్వర రావు, ప్రసాద్, బూసి పాండు తదితరులు ఉన్నారు.
పాల్వంచ : ప్రపంచం గర్వించదగ్గ ప్రముఖుడు అంబేద్కర్ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఎడవల్లి కృష్ణ కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానిక పూల మాలలు వేసి ఘనంగా నివ్నాలర్పించారు. ఈ సందర్భంగా ఎడవల్లి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు జలీల్, పాల్వంచ పట్టణ మైనారిటీ అధ్యక్షులు చాంద్ పాషా, పాల్వంచ పట్టణ ఓబీసీ అధ్యక్షులు చారీ, మురళి, సోషల్ మీడియా నియోజకవర్గ కో ఆర్డనేటర్ షఫీ, భద్ధి కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ ఆధ్వర్యంలో : బీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు మల్లికా, కుమారి, లలిత, మార్తామ్మ తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : అంబేద్కర్ మరణంలో అనేక అనుమానాలు వున్నాయని నేటికీ ఆ అనుమానాలు తొలగలేదని వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం అంబేద్కర్ 66వ వర్ధంతి మండల కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా అంబే ద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళు లర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఈఓ గంజి బాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బయ్యా రాము, సీఐటీయూ మండల కన్వీనర్ బర్ల తిరు పతయ్య, కెవిపిఎస్ మండల నాయకులు రాయల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో : మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్ళ అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సాలయ్య, మాజీ జడ్పీటీసీ భూపల్లి నరసిం హారావు, సుబ్రహ్మణ్యం, గ్రామ కమిటీ ప్రధాన కార్య దర్శి నాగరాజు, సత్యనా రాయణ, వెంకటేశ్వర్లు, ప్రవీణ్, సాయిబా బు, నరసింహా రావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురం : అంబేడ్కర్ వర్దంతిని గౌతమీ నగర్ కాలనీ ఆఫీస్‌లో హెవీ వాటర్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా బారజల కర్మాగారంలో నిర్వహించారు. అంబెడ్కర్ చిత్రపటానికి సీఏఓ ఎస్ వై కాంబ్లీ పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించి, మాట్లాడారు. శ్రీనివాసరావు, ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పాడ్య కేశవరావు, రామ మూర్తి,మోహన్ బాబు, వినరు సాగర్, పి.రామి రెడ్డి, సాధిక్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.