Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ కొత్వాల
నవతెలంగాణ-పాల్వంచ
ప్రభుత్వ అధికారులు మండలం అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులకు సహకరించాలని డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పాల్వంచ మండలం సర్వసభ్య సమావేశం ఎంపీపీ మడివి సరస్వతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ఎంపిక చేసిన ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే ఇబ్బందులు పడతారన్నారు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేయాలన్నారు. మూడు నెలలకొకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశాలకు విధిగా హాజరు కావాలన్నారు. హాజరుకాని సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం మద్దతు ధరకు గ్రేడ్-ఏ రూ.2060లు, సాధారణరకం రూ.2040లకు సేకరణ జరుగుతున్నదని కొత్వాల అన్నారు. సొసైటీ ద్వారా రుణం పొందిన రైతులు మార్చి 2023 లోపుగా రెన్యువల్ చేసుకోవాలన్నారు. రాబోయే యాసంగి పంటకు గాను ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు వారిగా సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేస్తున్నారని కొత్వాల అన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ మడివి సరస్వతి, జడ్పీటీసీ వాసుదేవరావు, తహసీల్దార్ రంగా ప్రసాద్, ఎండీఓ రవీంద్ర ప్రసాద్, ఎంపీఓ నారాయణ, పలువు రు ఎంపీటీసీలు, సర్పంచులు అధికారులు పాల్గొన్నారు.