Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంఘాలను లేకుండా చేయడం దుర్మార్గం
- ఘనంగా ఖమ్మం రీజియన్ మహాసభ
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని, ఆర్టీసీలో కార్మిక సంఘాలను లేకుండా చేయడం దుర్మార్గమని ఖమ్మం జిల్లా సీఐటీయూ కార్యదర్శి కళ్యాణ్ వెంకటేశ్వరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్ నందు ఖమ్మం రిజియన్ 11వ మహాసభ జరిగింది. ఈ మహా సభలో ఎస్‌డబ్ల్యూఎఫ్ జెండా ఆవిష్కరణ ఖమ్మం రీజియన్ అధ్యక్షులు ఏ.వెంకటేశ్వర్లు ఆవిష్కరణ చేసినారు. అనంతరం 2019 సంవత్సరంలో జరిగిన ఆర్టీసీ సమ్మె లో చనిపోయిన వారి ఫోటో ఎగ్జిభిషన్కు ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌ను సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గుగులోత్ ధర్మ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. తర్వాత మహా సభ ముందుగా సంతాప తీర్మానం ఖమ్మం డిపో కార్యదర్శి గుండు మాధవరావు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కళ్యాణ్ వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఆర్టీసీని నిర్వర్యం చేయాలని కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. తర్వాత రాష్ట్ర ఎస్డబ్ల్యూ కోశాధికారి ఏవి.రామారావు మాట్లాడుతూ డిపో లలో మనం ఐఖ్యతతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గడ్డం లింగమూర్తి నివేదిక ప్రవేశ పెట్టినారు. ఆ నివేదిక లో 2019 సంవత్సరం నుండి 2022 సంవత్సరం వరకు ఖమ్మం రీజియన్‌లో ఎస్డబ్ల్యూగా ఆర్టీసీలో పోరాటం నిరంతరం చేసినామని, 2019 సంవత్సరంలో ఆర్టీసీ సమ్మె తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సంఘాలు లేకుండా చేసిన సీఐటీయూ సహకారంతో ప్రతి డిపోలో పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. తర్వాత రిటైర్డ్ సీనియర్ నాయకులకు సన్మానం చేశారు. తర్వాత ప్రతి డిపో చర్చలు జరిపి భవిష్యత్ కార్యక్రమంపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మహాసభకు సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్సులు రమేష్, డి.వీరన్న పాల్గొన్నారు. ఈ మహాసభకు ప్రతి డిపో అధ్యక్షులు, కార్యదర్శిలు, డిపో ఎస్డబ్ల్యూ సిబ్బంది, ఖమ్మం రీజియన్ 6 డిపోల నుండి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ఖమ్మం రీజియన్ మహాసభలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది.