Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంటపొలాల్లో సీతమ్మ సాగర్
- పనులను సందర్శించిన సీపీఐ(ఎం) బృందం
నవతెలంగాణ-చర్ల
దశాబ్దాల కాలంగా కోరేగడ్డ భూముల పై జీవనం సాగిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలో గల సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వలన ముంపు గురయ్యే పంట పొలాలను వారు పర్యవేక్షించి మాట్లాడారు. తొలుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలో సీతారామ ప్రాజెక్టు కరకట్ట పనులను సీపీఐ(ఎం) బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మచ్చా మాట్లాడుతూ నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు కరకట్ట పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, నిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. పరిహారం ఇవ్వకుండా పనులు చేయవద్దని, రైతులకు న్యాయం చేయాలని కోరారు. కోరగడ్డ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని, సీతారామ ప్రాజెక్టు వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయని, వారికి 2013 భూ సేకరణ చట్టం ద్వారా రైతులకు కూలీలకు నష్టపరహారం అందించాలన్నారు. చర్ల మండలం గోదావరి పరివాహక ప్రాంతం అయిన కంటేపళ్లిలో సీతారామ ప్రాజెక్టు పనులను సందర్శించారు. దుమ్ముగూడెం మండలం సున్నం బట్టి గ్రామం నుండి మొదలయి ఆనకట్ట చర్ల మండలం ఎదురుగుట్టల వద్ద అబ్బరాసి బండల వరకు సాగుతోందని అన్నారు. మధ్యలో నిర్వహిత గ్రామాలైన లింగాల, మేడువాయి మీదుగా కొత్తపల్లి, లింగాపురం, చింతకుంట, జిపి పల్లి, వీరాపురం, సబ్బంపేట వరకు కోరగడ్డ ఆధారపడి ఎన్నో కుటుంబాలు దీవిస్తున్నాయని అన్నారు. తాతల కాలం నుండి జీవిస్తున్న రైతులకు నష్టపరిహారం అందించే దాంట్లో ప్రభుత్వం చొరవ చూపించాలని కోరారు. మానవత దృక్పదంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా కోరగడ్డలో సర్వే చేసి కుటుంబానికి ఐదు లక్షల తగ్గకుండా నష్టపరిహారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కే.బ్రహ్మచారి, మండల కార్యదర్శి కారం నరేష్, మచ్చ రామారావు, బందెల చంటి, పొడుపు గంటి సమ్మక్క, స్యామల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.