Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని సారపాక బ్రిలియంట్ హైస్కూల్, జూనియర్ కాలేజ్లో రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని విద్యార్థులు మాక్ పార్లమెంట్ సమావేశంను అబ్బురపరిచింది. ఈ సందర్భంగా బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత బిఎన్ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు మాక్ పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులు సంధించిన ప్రశ్నల బాణాలకి అధికారపక్షం సమాధానాలు దొరకక ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేశారు. ఈ సమావేశాన్ని చూస్తున్న విద్యార్థుల తల్లి దండ్రులు, విద్యార్థుల ప్రదర్శనను ఎంత గానో కొనియాడారు. అనంతరం బిఎన్ఆర్ మాట్లాడుతూ అంబేద్కర్ సామాజిక ఆర్థిక శాస్త్రాలలో ఎన్నో పరిశోధనలు చేసి భారత రాజ్యాంగ వ్యవస్థాపన కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.